యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్) సినిమా ట్రెయిలర్ ఈమధ్యనే విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. ” ఈ సినిమాని ఎంతో ఇష్టంగా తీశాను. కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం నా టీం చాలా కష్టపడింది. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన నగేష్ కి, సముద్రకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అని అన్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.