సూపర్ స్టార్ కృష్ణకు ప్రముఖుల బర్త్ డే విషెస్

సాహసమే ఊపిరిగా ఎన్నో కొత్త ఒరవడులు సృష్టించి సంచలన విజయాలు సాధించిన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ తన 78వ పుట్టినరోజును నేడు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన 78వ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కృష్ణకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు తన తండ్రికి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలియజేయగా… కోడలు నమ్రతా శిరోద్కర్, ఆయన కూతురు ఘట్టమనేని మంజుల, మెగాస్టార్ చిరంజీవి, అడివి శేష్, ఈషా రెబ్బా, అనిల్ రవిపుడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-