అమ్మో వద్దమ్మా…! పెట్రోల్ రేటుని దాటేసిన టమోటా

టమోటా.. పేరు చెబితే అంతా హడలిపోతున్నారు. ఒకప్పుడు రోడ్డుమీద పారబోసిన టమోటా ఇప్పుడు ఠారెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలకు రెక్కలు. గరిష్ఠంగా ధర కిలో రూ.130 పలకగా.. కనిష్టంగా ధర కిలో రూ.20పలికింది. ఉదయం కిలో టమోటా 104 రూపాయలకు అమ్మడయింది. టమోటా ధరలు చూసి అటువైపు వెళ్ళడానికే వినియోగదారులు జంకుతున్నారు. కూరల్లో టమోటాను నిషేధించారు. సాంబారు, టమోటా చట్నీకి రాం రాం చెప్పారు. టమోటా చట్నీ కావాలంటే అదనంగా చెల్లించాలని టిఫిన్ సెంటర్లవారు అంటున్నారు.

అమ్మో వద్దమ్మా…! పెట్రోల్ రేటుని దాటేసిన టమోటా
లీటర్ పెట్రోల్ కంటే టమోటా రేటు ఎక్కువ

ఒకప్పుడు ఉల్లి ధర ఇప్పుడు టమోటా ధరగా మారింది. టమోటాలు లేకుండా ఇళ్ళల్లో కూరలుండవు. టమోటా చట్నీ, టమోటా పప్పు.. ఇలా ఎందులోనైనా టమోటా వుండాల్సిందే. అలాంటిది పావుకిలో టమోటా కూడా కొనడానికి వెనుకాడుతున్నారు జనం. పావుకిలో టమోటా రేటుకి రెండుమూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని కూరగాయల వ్యాపారులే చెబుతున్నారు.

రెండు నెలల క్రితం కిలో టమోటా ధర రూ.10లు ఉండగా.. ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. టమోటాకు తోడు సాధారణ కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కరోనా కారణంగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న ప్రజలకు అధిక ధరలు మరింత భారంగా మారాయి. దేశమొత్తం మీద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా భారీవర్షాలు పడడంతో టమోటా రావడమే తగ్గిపోయింది. ధరలు తగ్గాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని వ్యాపారులు అంటున్నారు. టమోటాకు బదులు ఇతర కూరగాయలు వాడుతున్నామని మహిళలు చెబుతున్నారు. కర్రీ సెంటర్లలో టమోటా పేరు చెబితే కనిపించడం లేదు.

Related Articles

Latest Articles