టమాటా మాయం..! మార్కెట్‌లో కనిపించడంలేదు..!

వంటింట్లో టమాటా ఉండాల్సిందే..! ప్రతీ కూరలోనూ టమాటా వాడాల్సిందే..! అప్పుడే ఆ కూరకు టెస్ట్‌ వస్తుంది.. కానీ, ఇప్పుడు టమాటా దొరకడమే కష్టంగా మారే పరిస్థితి కనిపనిస్తోంది.. ఎందుకంటే.. ఎప్పుడూ మార్కెట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చే టమాటా ఇప్పుడు కనిపించడంలేదు.. మార్కెట్లు, రైతు బజారుల్లోనూ టమాటా జాడ కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.. మరోవైపు.. టమాటా ధర క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. సూపర్‌ మార్కెట్లు నేరుగా రైతు దగ్గరకే వెళ్లి టమాటాలు కొనేస్తున్నారు. క్రమంగా సూపర్‌ మార్కెట్లు కూడా శివారు ప్రాంతాల్లో విస్తరిస్తూ వస్తున్న తరుణంలో.. హోల్‌ సేల్‌ మార్కెట్‌కు వచ్చే పంట తగ్గిపోయింది.. ఇక, వర్షాలు కూడా పంటను దెబ్బ తీయడంతో దిగుబడి తగ్గిపోయింది.

Read Also: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. వారే టార్గెట్..!

ఇక, బోయిన్‌పల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌కు ప్రతీ రోజూ 4 వేల క్వింటాళ్ల వరకూ టమాటా వచ్చేదని.. కానీ.. గత వారం రోజులుగా పరిస్థితి మారిపోయి.. కేవలం 2 వేల లోపు క్వింటాళ్లకే పరిమితం అయ్యిందని వ్యాపారులు చెబుతున్నారు.. ఇతర కూరగాయల పరిస్థతి కూడా అదేఅని చెబుతున్నారు.. టమాటాతో పాటు అన్ని కూరగాయల ధరలు క్రమంగా పైపైకి కదులుతున్నాయి.. మరోవైపు.. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో తాజాగా కిలో టమాటా రూ.100గా పలికిన సంగతి తెలిసిందే. పంట దిగుబడిపై వర్షాలు ప్రభావం చూపడంతోనే మార్కెట్లకు వచ్చే టమాటా తగ్గిపోయిందని చెబుతున్నారు..

Related Articles

Latest Articles