దసరా: ఆసక్తికరంగా చిన్న సినిమాల భారీ పోటీ

ఈ దసరా పండక్కి స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో ఆ లోటును తీర్చేందుకు చిన్న సినిమాలు భారీగానే పోటీపడుతున్నాయి. మొదట ఒకటిరెండు బడా సినిమాలు వస్తాయనే ప్రచారం జరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా థియేటర్ల పరిస్థితి ఆశించినంతగా లేకపోవడంతో పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో మిగితా సినిమాలు దసరా బరిలో దిగుతున్నాయి.

ఈ నెల 24న దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. పండగ మూడు వారాల ముందే వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంతకాదనుకున్న ఈ సినిమా దసరా వరకు థియేటర్లో ఆడడం ఖాయం అనే పాజిటివ్ బజ్ విడుదల కంటే ముందే ఏర్పాడుతోంది. ఇక మెగా సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన సోషల్ మెసేజ్ డ్రామా ‘రిపబ్లిక్’ అక్టోబర్ 1న విడుదల కాబోతుంది. యువ ఐఏఎస్ అధికారిగా సాయి ధరమ్ తేజ్ కనిపించనుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక అక్కినేని అఖిల్ హీరోగా చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైనా పాటలు, టీజర్ కు మంచి ఆదరణ లభించింది. ఇక అదే రోజున క్రిష్ – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లోని ‘కొండపొలం’ సినిమాను విడుదల చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే వైష్ణవ్ భారీ విజయం అందుకున్నాడు కాబట్టి రెండో సినిమాకి మంచి బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ చిత్ర కంటెంట్ కూడా ఆసక్తిని కలిగిస్తుండటంతో గట్టి పోటీనిచ్చే సినిమాగా రానుంది.

అక్టోబస్ 14వ తేదీన ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్దార్థ్-శర్వానంద్ కలసి నటిస్తున్నారు. మరి ఈ సినిమా దసరా వసూళ్లను ఏమేరకు రాబట్టుకొంటుందో చూడాలి. ఇక ‘పెళ్లి సందD’ సినిమా కూడా దసరా తీసుకొస్తున్నాం అనడంతో దసరా రేసు ఈసారి చిన్న సినిమాలతో ఆసక్తిరేకిస్తోంది.

-Advertisement-దసరా: ఆసక్తికరంగా చిన్న సినిమాల భారీ పోటీ

Related Articles

Latest Articles