ఇకపై షూటింగ్ ల కోసం… యాక్టర్స్ తో పాటూ డాక్టర్స్!

సినిమా అంటే కథ, కథనం, నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్… ఇంతే అనుకునే వారు నిన్న మొన్నటి దాకా! కానీ, కరోనా దెబ్బతో సీన్ మారిపోయింది. సినిమా తయారవ్వాలంటే ఇప్పుడు వ్యాక్సినేషన్, డాక్టర్లు, మందులు కూడా ప్రధానం అయిపోయాయి! చిన్నా, పెద్దా హీరోలంతా కరోనా అలెర్ట్ తో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట!

ఫస్ట్ వేవ్ తరువాత కాస్త అజాగ్రత్తగా ఉండటంతో సెకండ్ వేవ్ నెత్తిన పడింది. ఇంకా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో షూటింగ్ లు రీస్టార్ట్ కూడా అవ్వలేదు. అయితే, మరోవైపు నుంచీ థర్డ్ వేవ్ అంటూ కొందరు బెంబేలెత్తిస్తున్నారు. ఇటువంటి అయోమయంలో స్టార్ హీరోలు ఏ మాత్రం రిస్క్ తీసుకోదలుచుకోవటం లేదట. త్వరలో భారీ చిత్రాలు తిరిగి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ‘ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప’ వంటి చిత్రాల యూనిట్స్ లో ప్రతీ ఒక్కరికి తప్పక టీకాలు వేయించే పనిలో ఉన్నారట నిర్మాతలు. అంతే కాదు, అగ్ర హీరోలంతా తమతో పాటూ ఓ డాక్టర్ కూడా సెట్ మీదే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, అవసరం అయితే మెడిసిన్స్ వంటివి షూటింగ్ లోని వారికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట.

‘అన్నాత్తే’ షూటింగ్ లో ఇప్పటికే తన డాక్టర్ ని రజనీకాంత్ వెంటబెట్టుకున్నారు. ఆయన పర్యవేక్షణలోనే చీత్రకరణలో పాల్గొన్నారు. అదే దారిలో మిగతా హీరోలు కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా, కరోనా ఫిల్మ్ మేకింగ్ లో పరిశ్రమకి కొత్త పాఠాలు నేర్పుతోందనే చెప్పాలి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-