జూలై మొదటివారంలో షూటింగ్స్ సందడి!

కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్‌ లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే ముంబయిలో షూటింగ్ లకు అనుమతినిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనూ షూటింగ్స్ కి అనుమతి వున్నా అప్పుడే సాహసం చేయటం లేదు. కాగా ఈ నెల చివర్లో షూటింగ్స్ పునప్రారంభం కానుండగా.. జులై మొదటివారంలో అన్ని సినిమాల షూటింగ్స్ మొదలు కానున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్స్ సైతం కరోనా ప్రభావంతో హైదరాబాద్ లోనే సెట్స్ వేస్తున్నారు. అయితే విడుదలకు రెడీగా వున్నా సినిమాలు మాత్రం తేదీలను ఖరారు చేసుకొనే పనిలో పడ్డాయి. అయితే.. సినిమా థియేటర్ల పున:ప్రారంభానికి మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే. సినిమా హాళ్లను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త సమయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-