మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్‌ రాజు భేటీ!

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌… వైసీపీ సర్కార్‌ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్‌ తీసుకువచ్చిన ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. అయితే….ఇలాంటి తరుణంలో మచిలీ పట్నంలో టాలీవుడ్‌ నిర్మాతలు దిల్‌ రాజు, డీవీవీ దానయ్య,సునీల్‌ నారంగ్‌, బన్నీ వాసు లు ఆంధ్ర రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. మంగళవారం మంత్రి నానికి ఫోన్‌ చేసి.. నిర్మాతలు వస్తారని మధ్యవర్తులు చెప్పారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే.. మచిలీ పట్నంలోని మంత్రి పేర్నినాని ఇంటికి చేరుకున్న టాలీవుడ్‌ నిర్మాతలు…అనంతరం ఆర్ అండ్ బీ భవనంలో మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం, సినిమా పరిశ్రమ సమస్యలపై మంత్రి పేర్ని నానితో నిర్మాతలు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ సర్కార్‌ పై పవన్‌ వ్యాఖ్యలు చేసిన తరుణంలో నిర్మాతలు… పేర్నినానిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

-Advertisement-మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్‌ రాజు భేటీ!

Related Articles

Latest Articles