హీరో కృష్ణుడు అరెస్ట్

సినీ ఆర్టిస్ట్ ఏ.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడును ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి పేకాట స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు..ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. టాలీవుడ్ ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన కృష్ణుడు ‘వినాయకుడు’ సినిమాలో హీరోగా నటించాడు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-