టాలీవుడ్ ఫస్ట్ సూపర్ గర్ల్ మూవీ!

స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ‘ఇంద్రాణి’. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఇది తెరకెక్కబోతోందని వారు అన్నారు. ఈ మూవీ గురించి వారు మరింతగా తెలియచేస్తూ, ”ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి దిగబోతోంది మా ఇంద్రాణి. వినూత్న ప్రయోగంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా ఇది రూపుదిద్దుకుంటుంది. లీడ్ రోల్ పోషిస్తున్న హీరోయిన్‌కి సూపర్ పవర్ ఉంటుంది. ఆమెతో పాటు కథ అంతా ట్రావెల్ చేసే మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో స్కోప్ ఉంది” అని దర్శకనిర్మాతలు చెప్పారు.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న స్టీఫెన్ న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ట్రైనింగ్ చేసి అక్కడే రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్‌పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి? చాలా గ్రాండ్‌గా వి.ఎఫ్. ఎక్స్. వర్క్ ఎలా జరగాలి? అనేదానిపై ఓ అంచనాకు వచ్చారు. ఆ తర్వాత ఇండియాలో మరో మూడు నెలలు రీసెర్చ్ చేసి సూపర్ అవుట్‌పుట్‌ని ఆడియన్స్ ముందు ఉంచడమే లక్ష్యంగా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, బ్యానర్ నేమ్ రిజిస్టర్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేశారు. షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూల్స్‌పై ప్రణాళిక రచించి రెడీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. భారీ కాస్టింగ్‌తో పాటు కొత్త నటీనటులను ఈ సినిమాతో ప్రోత్సహించబోతున్నారు. సాయి కార్తీక్ అందించబోతున్న మ్యూజిక్ సినిమాలో హైలైట్ కానుందని నిర్మాత చెప్పారు.

Related Articles

Latest Articles