టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు : రేపు ఈడీ ముందుకు చార్మీ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో గురువారం ఈడీ ఎదుట నటి చార్మీ హాజరుకానుంది. ఇప్పటికే చార్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చార్మీ గురించి ఈడీకి కెల్విన్‌ ఎలాంటి విషయాలు అందజేశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈడీ చార్మి బ్యాంకు అకౌంట్లను కూడా పరిశీలించనున్నారు. చార్మికి చెందిన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీయబోతోంది. పూరీ జగన్నాధ్‌తో కలిసి సినిమా నిర్మాణంలోకి వచ్చింది చార్మ. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసినట్లు ఈడీ వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం.

Related Articles

Latest Articles

-Advertisement-