రమేష్ బాబుకు కడసారి వీడ్కోలు… సెలెబ్రిటీల నివాళి

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్‌ బాబు నిన్న అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కానీ రమేష్ బాబు ఆసుపత్రికి చేరుకునే లోపే తుది శ్వాస విడిచినట్లు సమాచారం. మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. రమేష్ బాబు 20కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన కేవలం నటుడే కాదు నిర్మాత కూడా. ఇక రమేష్ బాబు హఠాన్మరణాన్ని చిత్రసీమ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయనకు కడసారి నివాళులు అర్పిస్తూ చిరంజీవితో పాటు పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

Read Also : రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు ?

Image

Related Articles

Latest Articles