సినీ ప్ర‌ముఖుల గణేశ్ పూజ‌లు.. వైరల్ ఫోటోలు

వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్ర‌ముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి త‌న ఇంట్లో మ‌ట్టితో చేసిన వినాయ‌కుడికి భార్య‌తో క‌లిసి పూజ‌లు చేశారు. మరోవైపు, సినీన‌టుడు మోహ‌న్ బాబు విఘ్నేశ్వ‌రుడి పూర్తి క‌థ‌ను చెప్పారు. ఈ క‌థ చెప్పాల‌ని త‌న కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ క‌థ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశాన‌ని మోహ‌న్ బాబు అన్నారు. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టి ఆర్హా తన చిట్టి చేతులతో మట్టి గణేశుడ్ని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఉన్న ఈ పిక్‌ అభిమానుల మనసులు దోచుకుంటోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.. వినాయకుడు తన అనంతమైన జ్ఞానంతో మన జీవితాలను సుసంపన్నం చేస్తాడు’ అని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టక్ జగదీశ్ (నాని) ఆయన కుమారుడు అర్జున్‌తో పూజ చేస్తున్న ఫొటో అభిమానులతో పంచుకున్నారు.

Image

Related Articles

Latest Articles

-Advertisement-