బాలయ్య బర్త్ డే: చిరు, వెంకీ, మహేష్ స్పెషల్ విషెస్

నేడు నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా అభిమానులతో పాటుగా టాలీవుడ్ ప్రముఖులు విషెస్ తెలియచేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ కూడా రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య-బోయపాటి సినిమా ‘అఖండ’ నుంచి న్యూ పోస్టర్ విడుదల కాగా.. ఆయన తదుపరి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని అధికారికంగా ప్రకటిస్తూ వీడియో విడుదల చేసింది మైత్రి మూవీ మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ.. ‘మిత్రుడు బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషెస్ తెలుపుతూ.. ‘జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ప్రియమైన బాలకృష్ణ గారు !! మీకు ప్రశాంతమైన మరియు సురక్షితమైన సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నాము’ అంటూ విష్ చేశారు.

దర్శకుడు క్రిష్‌ విషెస్ తెలుపుతూ.. ‘నవయవ్వనుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అన్ని శుభాలే జరగాలని దేవుడ్ని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-