ఈరోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు…

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 900 వద్ద ఉన్నది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర కూడా రూ.65,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Related Articles

Latest Articles