ఐపీఎల్ 2021 : వికెట్ కీపర్ లలో విజయం ఎవరిది…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీని నడిపించే  పంత్ కు అలాగే రాజస్థాన్ కెప్టెన్ సంజుకు ఐపీఎల్ కెప్టెన్సీలో కేవలం ఒక్కే మ్యాచ్ అనుభవం ఉంది. అయితే భారత జట్టులో స్థానం కోసం ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుంది. వీరిద్దరూ వికెట్ కీపర్లు కావడమే అందుకు కారణం. కానీ ఇండియన్ టీంలో మాత్రంపంత్ కే ఎక్కువ అవకాశాలు దొరికాయి. కానీ ఇక్కడ ఐపీఎల్ లో ఇద్దరు ఆటగాళ్లు సమానమే. ఇక వీరు కెప్టెన్సీ చేసిన మెదటి మ్యాచ్ లో పంత్ జట్టు విజయం సాధించగా సంజు జట్టు ఓడిపోయింది. కానీ శాంసన్ మాత్రం సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టుకి వారి స్టార్ బౌలర్ రబడా అందుబాటులోకి రాగ రాజస్థాన్ కు మాత్రం వారి స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ ఈ సీజన్ కే దూరమయ్యాడు. అయిన కూడా రాజస్థాన్ జట్టులో ఢిల్లీలో కంటే ఎక్కువ మంది హిటర్లు ఉన్నారు. అందువల్ల ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు… పంత్, సంజులో ఎవరి న్యాయకత్వం, వ్యూహాలు ఫలిస్తాయి అనేది చూడాలి. 

Related Articles

Latest Articles