ఐపీఎల్ 2021 : గత సీజన్ లో చివర్లో నిలిచిన రెండు జట్లు… ఈసారి..?

ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో నిలవగా రాజస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన ఈ రెండు జట్లు తమ రెండు మ్యాచ్ లో విజయం సాధించి ఇప్పుడు మూడో మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఆడిన గత మ్యాచ్ ప్రకారం చూస్తే చెన్నై బౌలర్లు ఫామ్ లో ఉంటె రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ మంచి ఊపులో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగె అవకాశం ఉంది. అయితే మొత్తం ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 23 సార్లు తలపడ్డగా చెన్నై 14 మ్యాచ్ లలో విజయం సాధిస్తే రాజస్థాన్ 9 మ్యాచ్ లలో విజయం సాధించింది. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ లో కూడా కెప్టెన్ గా ఎంతో అనుభవం ఉన్న ధోని వ్యూహాలను కేవలం ఈ ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన సంజు శాంసన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది.       

Related Articles

Latest Articles