ఐపీఎల్ 2021 : పేరు మార్చుకొని వాళ్ళు… కెప్టెన్ ను మార్చుకొని వీళ్ళు

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒక్కటి. ఇక గత ఏడాది ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గా మారిలోకి దిగ్గిన పంజాబ్ కింగ్స్ ప్పోయింట్ల పట్టికలో 6వ స్థానానికి పరిమితం అయ్యింది. దాంతో అదృష్టం మార్చుకోవడం కోసం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో జట్టు పేరును మార్చుకొని బరిలోకి దిగుతుంది పంజాబ్. 

ఇక గత ఏడాది స్మిత్ కెప్టెన్సీ లో దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచినా రాజస్థాన్ రాయల్స్ ఈ ఏడాది తమ కెప్టెన్ ను మార్చుకొని వస్తుంది. ఈ ఏడాది చెన్నై లో జరిగిన మినీ వేలానికి స్మిత్ ను వదిలేసిన రాజస్థాన్ ఈ ఐపీఎల్ సీజన్ కు తమ కెప్టెన్ గా సంజు శాంసన్ ను ఎంపిక చేసింది. అయితే ఈరోడ్డు జట్లు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను సమానంగా ఉన్నాయి. దాంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు.. ఈ జట్టు మార్పు పని చేస్తుంది అనేది చూడాలి. 

Related Articles

Latest Articles