ఐపీఎల్ 2021 : గత ఐపీఎల్ ఫైనల్ ఓటమికి ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు చివరిసారిగా గత ఐపీఎల్ ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే.  అప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన ముంబై మొదటిసారి ఫైనల్స్ కు వెళ్లిన ఢిల్లీని ఓడించి ఐదోసారి టైటిల్ విజేతగా నిలవగా మొదటిసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడాలనుకున్న ఢిల్లీకి నిరాశే మిగిలింది. దాంతో ఈరోజు జరగనున్న ఐపీఎల్  మ్యాచ్ లో ముంబై పై గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ చూస్తుంది. అయితే ఈ ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఆడిన చివరి మ్యాచ్ లలో విజయం సాధించి దానిని కొనసాగించాలని చుస్తున్నాయి. ఇక ప్రస్తుతం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లలో ఈరోజు ఎవరు విజయం సాధిస్తే వారు చెన్నైని వెన్నకి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటారు. అయితే ఈ రెండు జట్లు ఐపీఎల్ లో ఇప్పటివరకు 28 సార్లు పోటీ పడ్డగా ముంబై 16 మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఢిల్లీ 12 మ్యాచ్ లలో గెలిపొందింది. మరి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.        

Related Articles

Latest Articles

-Advertisement-