ఐపీఎల్ 2021 : చెన్నై మొదటి స్థానానికి చేరుకుంటుందా…?

ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసిన చెన్నై ఈ ఏడాది సీజన్ ను మాత్రం మంచిగానే ఆరంభించింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన చెన్నై  మొదటి మ్యాచ్ లో ఓడిపోయి తర్వాత రెండు  మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేసింది. ఇక కోల్‌కత మాత్రం ఈ ఐపీఎల్ 2021 లో కేవలం మొదటి మ్యాచ్ లో విజయమ్మ సాధించి తర్వాత రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దాంతో ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ చాలా ఆసక్తిగా మారింది. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే రన్ రేట్ కారణంగా మొదటి స్థానానికి వెళ్తుంది. అయితే ప్రస్తుతం ఆ స్థానంలో బెంగళూరు ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ ఇందులో కోల్‌కత విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో స్థానం మారదు కానీ తమకు రెండు పాయింట్లను కలుపుకుంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

Related Articles

Latest Articles

-Advertisement-