టుడే కోవిడ్ అప్ డేట్

1 భారతదేశంలో రోజురోజుకూ కొత్త కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం … బుధవారం లక్షా 94 వేల 720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 442 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు 5 వేలకు సమీపించాయి.

2 దేశంలోని 19 రాష్ట్రాల్లో 10వేల కంటే ఎక్కువ యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. 2లక్షల 25 వేల 199 యాక్టివ్ కోవిడ్-19 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో లక్షా 2 వేల 236 కేసులు వున్నాయి.

3.తమిళనాడులో 75 వేల 83 కేసులు, ఢిల్లీలో 74 వేల 881 కేసులు, కర్ణాటకలో 73 వేల 289 కోవిడ్ కేసులు ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో 5 వేల నుంచి 10వేల వరకూ యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి.

4.దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో ఏం చేయాలనే దానిపై ప్రధాని దిశా నిర్దేశం చేయనున్నారు. వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలపై చర్చించనున్నారు.

5. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ 153 కోట్లను దాటింది. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి 2.8 కోట్లకు పైగా డోసులు అందాయి. 18 లక్షల 85 వేల 715 ప్రికాషనరీ డోసుల పంపిణీ జరిగిందని కేంద్రం తెలిపింది.

6.ఏపీలో భారీగా పెరిగాయి కరోనా పాజిటివ్ కేసులు. 41,954 శాంపిల్స్ పరీక్షించగా 3,205 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఏపీలో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 281 మంది. విశాఖలో అత్యధికంగా 695 కేసులు, చిత్తూరులో 607 కేసులు నమోదయ్యాయి.

Related Articles

Latest Articles