ఈరోజే హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్…

తెలంగాణలో ఈటల రాజీనామా తర్వాత రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే నేడు హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు నుండి ఈనెల 8 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక అభ్యర్థులు నామినేషన్ వేసిన నుండి వారి ఎన్నికల ఖర్చు లెక్కించనున్నారు అధికారులు. ప్రతి అభ్యర్థి ఈ ఎన్నికల్లో 28 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు. అయితే ఈ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలి. ఇక నేడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం దగ్గర రెండేంచల భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ నామినేషన్ కు సెలవురోజు మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ ఉప ఎన్నికల నామినేషన్ బరిలో ఎంతమంది నిలుస్తారు అనేది చూడాలి.

-Advertisement-ఈరోజే హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్...

Related Articles

Latest Articles