స్థిరంగా బంగారం..పెరిగిన వెండి ధరలు

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,510 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,560 కి చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ. 69,800 పలుకుతుంది.

Related Articles

Latest Articles

-Advertisement-