టుడే కరోనా అప్‌డేట్స్

★ దేశవ్యాప్తంగా ఈరోజు 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు పార్లమెంట్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 850కి చేరింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు

★ ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. మరోవైపు ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,509కి చేరింది.

★ తెలంగాణలో ఈరోజు కొత్తగా 1,963 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులను అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,81,091 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 22,017 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,054కి పెరిగింది.

★ దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కొత్తగా 20,718 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30.64 శాతంగా నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,407కి పెరిగింది.

★ కర్ణాటకలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 2.18 లక్షల టెస్టులు చేయగా 32,793 కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక్క బెంగళూరులోనే 22,284 కరోనా కేసులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

★ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాజాగా 10,661 కరోనా కేసులు, 11 మరణాలు వెలుగు చూశాయి. కొత్తగా కోవిడ్ బారిన పడిన వారిలో 84 శాతం మందికి అసలు లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు.

★ యూపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూపీలో కొత్తగా 15,795 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం యూపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,148గా నమోదైంది. లక్నోలో 2,769 కరోనా కేసులు వెలుగు చూశాయి.

★ కేరళలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం మరో 48 కొత్త కేసులు వెలుగు చూడటంతో కేరళలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 528కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Related Articles

Latest Articles