నేడు ఈడీ ముందుకు నటుడు నవదీప్…

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఒక్కొక్కరిగా విచారిస్తున్న ఈడీ ముందుకు నేడు నటుడు నవదీప్ అలాగే ఎఫ్ క్లబ్ మేనేజర్ వెళ్లనున్నారు. ఈ ఇద్దరిని కలిపి ఈడీ విచారించనుంది. అయితే నేడు మరోసారి విచారణకు రావాలని కెల్విన్ కి ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే మొత్తం ఈ కేసు ఎఫ్ క్లబ్ చుట్టూ తిరుగుతుంది. ఎఫ్ క్లబ్ మేనేజర్ ద్వారా కెల్విన్ నుండి చాలా మంది నటులు డ్రగ్స్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. దాంతో నేడు కెల్విన్, ఎఫ్ క్లబ్ మేనేజర్ ని సుదీర్ఘంగా విచారించనుంది ఈడీ. అయితే నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ ని బ్యాంక్ స్టేట్మెంట్ లతో 10 గంటలకు హాజరు కావాలని తెలిపింది. ఎఫ్ క్లబ్ మేనేజర్ బ్యాంక్ నుండి పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు అయినట్లు తెలుస్తుంది.

Related Articles

Latest Articles

-Advertisement-