భారత్ కరోనా అప్డేట్…

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,618 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 330 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 36,385 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,21,00,001కు పెరగగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,40,225 కు చేరింది.. మరోవైపు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.. ఇక, ఇప్పటి వరకు 67,72,11,205 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని ప్రకటించింది.

Related Articles

Latest Articles

-Advertisement-