భారత్ కరోనా : స్వల్పంగా తగ్గిన కేసులు…

ఇండియాలో క‌రోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 38,079 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,10,64,908 కి చేరింది. ఇందులో 3,02,27,792 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,24,025 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 560 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,13,091 మంది మృతిచెందారు. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో 43,916 మంది కోలుకొని డిశ్చార్జ్ కావ‌డం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-