ఏపీ కరోనా అప్డేట్…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,797 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,89,513 కి చేరింది. ఇందులో 18,38,469 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,706 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 5,498 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 97,696 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

-Advertisement-ఏపీ కరోనా అప్డేట్...

Related Articles

Latest Articles