తెలంగాణలో ఈరోజు పెరిగిన కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 329 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా తో ఒక్కరు మృతిచెందారు.. ఇక, 307 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,60,471 కు చేరగా.. రికవరీ కేసులు 6,51,085 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,889 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 98.57 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,497 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 78,421 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Related Articles

Latest Articles

-Advertisement-