ఏపీ కరోనా అప్డేట్…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,505 శాంపిల్స్‌ పరీక్షించగా… 2,209 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 22 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 1,896 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,78,350కు.. రికవరీ కేసులు 19,44,267కు పెరిగాయి.. ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 13,490 గా ఉండగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,593 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ పరీక్షల సంఖ్య 2,50,27,770 కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Related Articles

Latest Articles