తెలంగాణలో నేడు పెరిగిన కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా కేసులు ఈరోజు పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 207 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 184 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,70,139 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,62,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,946 కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.14 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 98.81 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,108 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది.

Related Articles

Latest Articles