భారత్ కరోనా అప్డేట్…

దేశంలో క‌రోనా కేసులు నేడు తగ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 18,132 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,39,71,607 కి చేర‌గా ఇందులో 3,32,93,478 మంది ఇప్పటికే కోలుకున్నారు. 2,27,347 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 193 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,50,782 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంట‌ల్లో 46,57,679 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 95,19,84,373 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.

-Advertisement-భారత్ కరోనా అప్డేట్...

Related Articles

Latest Articles