ఏపీ కరోనా అప్డేట్…

ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉద‌యం 9 గంట‌ల నుంచి ఈరోజు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 45,553 శాంపిల్స్‌ను ప‌రీక్షించగా, 1,190 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,29,985 కి చేరింది. ఇందులో 20,00,877 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1,226 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, రాష్ట్రంలో ప్రస్తుతం 15,110 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ పేర్కొన్నది. రాష్ట్రంలో కొత్తగా క‌రోనాతో 11 మంది మృతి చెందారు. ఇప్పటి వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 13,988 కి చేరింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-