తెలంగాణ కరోనా అప్డేట్…

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 22,902 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మరణించారు. తాజా కేసులతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,74,555 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మృతుల సంఖ్య 3,981కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 153 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,66,999 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,575 మందికి చికిత్స జరుగుతోంది అని ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

Latest Articles