ఇండియా కరోనా : మళ్ళీ 10 వేలు దాటినా కేసులు..

ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,197 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,38,73,890 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,28,555 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 301 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,64,153 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,134 మంది క‌రోనా నుంచి కోలుకోగా 50,71,135 మంది టీకాలు తీసుకున్నారు. ఇక దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల శాతం 0.82 గా ఉంది అని పేర్కొంది సర్కార్.

Related Articles

Latest Articles