క‌రోనా విజృంభ‌ణ‌.. త‌మిళ‌నాడు కీల‌క నిర్ణ‌యం

భార‌త్‌లో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతూనే ఉంది.. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయా రాష్ట్రాలు క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి.. తాజాగా తమిళనాడు స‌ర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వ‌చ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మ‌ళ్లీ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువ‌డే వ‌ర‌కు ఆ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది ప్ర‌భుత్వం.. ఇక‌, మే 2వ తేదీన‌ రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ అమ‌లుచేయ‌నున్నారు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా.. మే 2న కౌంటింగ్ ప్ర‌క్రియ‌తో పాటు ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్ర‌కారం.. రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల మధ్య కర్ఫ్యూ అమ‌లులో ఉండ‌నుండ‌గా.. ఎలాంటి సడలింపులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్.. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతించిన విమానాలు మినహా మిగతా ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక‌, నాన్ వెజ్ మార్కెట్లు శనివారం మూతప‌డ‌నుండ‌గా.. ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, టీఎన్‌పీఎస్‌సీ, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్ర‌త్యేక కార్డులు జారీ చేయ‌నున్నారు.

-Advertisement-క‌రోనా విజృంభ‌ణ‌.. త‌మిళ‌నాడు కీల‌క నిర్ణ‌యం

Related Articles

Latest Articles