ట్రైన్ నుంచి దూకి వాలంటీర్ చందన ఆత్మహత్య

తిరుపతిలోని శ్రీకాళహస్తిలో వాలంటీర్ చందన ఆత్మహత్యకు పాల్పడింది.. రైలు నుంచి దూకి రెండేళ్ల కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతిలోని కొర్లగుంట గ్రామానికి చెందిన చందన 9 వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ గొడవలే కారణంగా తెలుస్తోంది.

Related Articles

Latest Articles