తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తిరుపతి విమానాశ్రయ ప్రైవేటీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది.. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి విమానాశ్రయం కూడా ఒకటి. ప్రైవేటుపరం కానున్న మొత్తం 13 విమానాశ్రయాల్లో చిన్నవి ఏడింటినీ మిగిలిన ఆరు పెద్ద విమానాశ్రయాలతో విలీనం చేయనున్నారు. తిరుచ్చి విమానాశ్రయ పరిధిలోకి తిరుపతి విమానాశ్రయం రానుంది.

ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోంది. విశాఖపట్నం, విజయవాడ తర్వాత ఏపీలో అత్యధిక విమాన ప్రయాణికుల సంఖ్య తిరుపతి విమానాశ్రయం నుంచే వున్నాయి. త్వరలో తిరుపతి విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభం అవుతాయి అని భావిస్తుండగా.. ఇంతలోనే ప్రైవేటుపరం నిర్ణయం పట్ల విమర్శలు మొదలైయ్యాయి. అధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తిరుపతిలోని విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-