తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌ర్వం సిద్ధం…

తిరుమ‌ల‌లో రేప‌టి నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కాబోతున్నాయి.  దీనికి సంబంధించి ఏర్పాట్ల‌ను టీటీడీ స‌ర్వం సిద్ధం చేస్తున్న‌ది.  రేప‌టి నుంచి ఈనెల 15 వ తేదీ వ‌ర‌కు శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈరోజు సాయంత్రం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఇక రేపు సాయంత్రం 5:10 గంట‌ల‌కు మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు.  రేపు రాత్రి పెద్ద శేష వాహ‌న సేవ‌తో వాహ‌న సేవ‌లు ప్రారంభం కాబోతున్నాయి.  9 రోజుల‌పాటు వివిధ వాహ‌నాల‌పై శ్రీవారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నారు.  ఈనెల 15 వ తేదీన చ‌క్ర‌స్నానంతో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.  అయితే, క‌రోనా దృష్ట్రా ఈ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీటీడీ తెలియ‌జేసింది.  బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్ధు చేసింది.  

Read: ర‌ష్యా సాహసం: అంత‌రిక్షంలో తొలిసారి సినిమా షూటింగ్‌…

-Advertisement-తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌ర్వం సిద్ధం...

Related Articles

Latest Articles