భారత్‌లో మళ్లీ టిక్‌టాక్..?

టిక్‌టాక్‌ యాప్‌ తక్కువకాలంలోనే ఎంతో ఆదరణ పొందింది.. ఎంతోమంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పాలియ.. అయితే, భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో.. ఈ చైనా యాప్‌పై భారత్‌ నిషేధం విధించింది.. దీంతో.. కనుమరుగైపోయింది.. కానీ, టిక్‌టాక్‌ ఇప్పుడు పేరు మార్చుకుని తిరిగి దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఆ యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ కొత్తగా టిక్‌టాక్‌ (ఖీజీఛిజు ఖీజీఛిజు) అన్న పేరును ట్రేడ్‌మార్క్‌గా దరఖాస్తు చేసుకోవడంతో.. మళ్లీ ఆ సంస్థ ప్రయత్నాలు ఆరంభించిందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు టెక్‌ నిపుణులు. ఆ దరఖాస్తును బైట్‌ డ్యాన్స్‌ సంస్థ ఈ నెల 6న దాఖలు చేసినట్టుగా చెబుతున్నారు.. కానీ, దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు.. మరోవైపు తమ సంస్థ భారత్‌లోకి తిరిగి ప్రవేశించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సంస్థ వర్గాలు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-