కేంద్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపిస్తుంది: రాకేష్‌ టికాయత్‌

రైతులు ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహా ధర్నాకు ముఖ్య అతిథిగా కిసాన్‌ సంయుక్త మోర్చా నాయకుడు రాకేష్‌ టికాయత్‌తో పాటు ఉత్తారాది రైతు సంఘాల నేతలు ఈ మహాధర్నాకు హాజరయ్యారు.ఈ సందర్భంగా టికాయత్‌ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. భాష వేరు కావొచ్చు రైతులందరి లక్ష్యం ఒక్కటేనన్నారు. రైతుల సంఘాలు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదన్నారు. కేంద్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపిస్తుందన్నారు.

మూడు రైతు చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మిగిలిన డిమాండ్లను కూడా నేరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. మోడీ బడా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్‌ మద్ధతు ధరకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్‌లో ప్రశేశపెట్టి స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే మా పోరాటం వదిలిపెడతామని రాకేష్‌ టికాయత్‌ తెలిపారు. తెలంగాణ రైతులు అధికార పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కేవలం మద్దతు ధర కాకుండా విద్యుత్‌ సవరణ బిల్లు, ఈ పోరాటంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే వరకు పోరాటాన్ని వదలబోమని టికాయత్‌ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles