యూపీలో దారుణంః భారీ వ‌ర్షం..పిడుగులు… 18 మంది మృతి…

దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  దక్షిణాదిన కేర‌ళ‌, తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  గ‌త రెండు రోజులుగా విస్తారంగా వాన‌లు కురుస్తుండ‌టంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  అటు ఉత్త‌రాదిన వ‌ర్షాలు దుమ్మురేపుతున్నాయి.  యూపీ, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల‌తో పాటుగా పిడుగులు ప‌డ్డాయి.  

Read: బ్రేకప్ తర్వాత బీచ్ లో మెహ్రీన్.. కొత్త ఉత్సాహం

యూపీలో భారీ వ‌ర్షంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు ప‌డ‌టంతో 18 మంది మృతి చెందారు.  అటు రాజ‌స్థాన్‌లో కూడా భారీ వ‌ర్షంతో పాటు పిడుగులు ప‌డ్డాయి.  ఈ పిడుగుల‌కు 20 మంది బ‌ల‌య్యారు.  దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు, పిడుగులు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీచేసింది.  తీర‌ప్రాంతంలోని రాష్ట్రాలు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-