నోట్స్ ఇస్తానని పిలిచి.. ఇద్దరమ్మాయిలను ఆ ముగ్గురు ఏం చేశారంటే..?

బీహార్ లో దారుణం చోటుచేసుకొంది. స్నేహితులే కదా అని నమ్మి ఇంటికి వెళ్లిన అమ్మాయిలపై ముగ్గురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. గదిలోకి వచ్చిన వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలలోకి వెళితే.. నవాడా నగరంలో ఒక యువతి కుటుంతో కలిసి నివాసముంటోంది. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆమె కాలేజ్ కి సెలవు పెట్టింది. త్వరలో పరీక్షలు మొదలుకానుండడంతో ఆరోజు జరిగిన క్లాస్ నోట్స్ తీసుకోవడానికి పక్క వీధిలో ఉంటున్న తన స్నేహితుడు ఆబీద్ ఇంటికి వెళ్ళింది. తనతో పాటు మరో స్నేహితురాలిని కూడా వెంట బెట్టుకెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్ ఆబీద్ తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నారు. యువతులు రావడం ఆలస్యం వారు గదికి గొళ్ళెం పెట్టి వారిపై అఘాయిత్యానికి తెగబడ్డారు.

ఒకరి తరువాత ఒకరు ఇద్దరు అమ్మాయిలపై అత్యచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైన చెప్తే చంపేస్తానని బెదిరించారు. కానీ, సదురు యువతి మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని మొత్తం పోలీసులకు వివరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Latest Articles