తెలుగు అకాడమీ స్కామ్‌.. అసలు కారణం ఇదే-త్రిసభ్య కమిటీ

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.. దీంతో, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం.. అసలు ఈ నిధుల గోమాల్‌కు ప్రధాన కారణం ఏంటి? అనేతి తేల్చింది త్రిసభ్య కమిటీ.. తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యమే నిధుల గోల్ మాల్ కు ప్రధాన కారణం అని తన నివేదికలో పేర్కొంది త్రి సభ్య కమిటీ.. తెలుగు అకాడమీకి సంబంధించిన నిధులు అన్ని బ్యాంకులలో కలిపి రూ.340 కోట్లు ఉండగా.. మూడు బ్యాంక్ అకౌంట్స్ నుండి నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి.. యూబీఐ కార్వాన్‌ బ్రాంచ్‌లోని అకౌంట్ నుండి రూ.43 కోట్లు, సంతోష్ నగర్ నుండి రూ.12 కోట్లు, చందానగర్ లోని బ్రాంచ్‌ అకౌంట్ నుండి రూ.10 కోట్లు మాయం చేసినట్టు తేల్చింది.

అకౌంట్స్ ఆఫీసర్ నుండి డైరెక్టర్ వరకు నిధుల గోల్ మాల్ పై ఇన్వాల్విమెంట్ లేకున్నా… ఏమి జరుగుతుందో పట్టించుకోలేదు.. కావున వారందరు బాధ్యులే అని నివేదికలో పేర్కొంది త్రిసభ్య కమిటీ.. బాధ్యులపై క్రిమినల్ చర్యలే కాకుండా, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సూచిచింది.. అకౌంట్స్ విషయంలో రెగ్యులర్ ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేసింది.. తెలుగు అకాడమీకి ఇంచార్జ్ లను కాకుండా రెగ్యులర్ డైరెక్టర్ ని నియమించాలని.. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన నిధులపై రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలని ప్రభుత్వానికి నివేదించింది త్రిసభ్య కమిటీ. మొత్తంగా తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో 22 పేజీల రిపోర్ట్‌ తయారు చేసి.. విచారణ వివరాలతో పాటు… సిపార్సులు కూడా చేసింది ఉమర్ జలీల్ కమిటీ.

-Advertisement-తెలుగు అకాడమీ స్కామ్‌.. అసలు కారణం ఇదే-త్రిసభ్య కమిటీ

Related Articles

Latest Articles