తెలుగు అకాడమీలో అక్రమాలు.. ముగ్గురు సభ్యులతో కమిటీ

తెలుగు అకాడమీలో అక్రమాలు వెలుగుచూశాయి.. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. వాటిని నిగ్గు తేల్చే పనిలో పడిపోయారు అధికారులు.. దాని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి.. ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపిన తెలుగు అకాడమీ డైరెక్టర్‌.. ఇప్పటికే తెలుగు అకాడమీ తరఫున సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని.. విచారణ కూడా ప్రారంభం అయినట్టు ప్రకటించారు.

-Advertisement-తెలుగు అకాడమీలో అక్రమాలు.. ముగ్గురు సభ్యులతో కమిటీ

Related Articles

Latest Articles