‘పసివాడి ప్రాణం’ కోసం ఏంజిలీనా పోరాటం… జూన్ 10 నుంచీ!

ఏంజిలీనా జోలీ నటించిన తాజా చిత్రం ‘దోస్ హూ విష్ మీ డెడ్’ ఇండియాలో జూన్ 10న విడుదల కాబోతోంది. అయితే, అమెరికాలో ఒకేసారి థియేటర్స్ అండ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ ఇక్కడ మాత్రం ఆన్ లైన్ స్ట్రీమింగ్ తోనే సరిపెట్టుకుంటోంది. ఆస్కార్ నామినేషన్ పొందిన టాలెంటెడ్ డైరెక్టర్ టేలర్ షెరిడాన్ రూపొందించిన ‘దోస్ హూ విష్ మీ డెడ్’ యూఎస్ లో మే 14న విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ తో పాటే వార్నర్ మీడియా వారి ‘హెబ్ బీవో మ్యాక్స్’లోనూ ఓటీటీలోనూ జనానికి అందుబాటులోకి వచ్చింది.

అక్కడ చాలా వరకూ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయితే, ఇండియాలో లాక్ డౌన్ వల్ల థియేటర్స్ తెరిచి లేకపోవటంతో ‘దోస్ హూ విష్ మీ డెడ్’ ఇంత వరకూ రిలీజ్ కాలేదు. జూన్ 10వ తేదీ నుంచీ కేవలం ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి సిద్ధపడుతోన్న ఏంజిలీనా స్టారర్ మనం ‘బక్ మై షో’ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై చూడొచ్చు. ఓ పన్నెండేళ్ల బాలుడ్ని కిరాతకులైన కిరాయి హంతకులు వేటాడుతుంటారు. హీరోయిన్ ఏంజిలీనా ఆ పసివాడ్ని ఎలా రక్షించిందనేదే… ‘దోస్ హూ విష్ మీ డెడ్’ కథాంశం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-