జగన్ కు లైన్ క్లియర్ చేస్తున్న ఆ ఇద్దరు నేతలు?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని కొట్టారు. ఈ వ్యూహం నాడు సత్ఫలితాలు ఇవ్వడంతో ఏపీలోనూ ఇదే ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు ముందుగానే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకెళుతున్నారు. దీంతో ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనపై పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు రోజురోజుకు బలహీనపడుతున్నాయి. ఈక్రమంలోనే మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనే ప్రచారం ఏపీలో జోరుగా సాగుతోంది. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించినట్లుగా ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీ ట్రాప్ లో టీడీపీ, జనసేన పార్టీలు చిక్కుకోవడంతో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా తిరుగులేదనే వాదనలు విన్పిస్తున్నాయి.

ఏపీలో ఎవరు అవునన్న.. కాదన్న కులాల ప్రతిపాదనకే ఓట్లు పడుతాయి. రాజకీయ నాయకులకు ఈ విషయం తెలుసు గనుకే ప్రజలను కులాల వారీగా విభజించే ప్రయత్నం చేస్తుంటారు. గత ఎన్నికల్లోనూ కులాల ప్రభావం గెలుపొటములపై భారీగానే చూపించింది. టీడీపీకి తొలి నుంచి సపోర్టు చేసే ఓ సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచింది. దీంతో ఆపార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రాగా టీడీపీ బొక్కబొర్లా పడింది. అయితే ఈ సామాజిక వర్గం రాబోయే ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతుందో తెలియడం లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఫాలో అయినా ఫార్మూలానే మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని జగన్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో కమ్మ, నాన్ కమ్మగా ప్రజలు విడిపోయి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఈ ఎత్తుగడ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇక జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మరోలా కలిసి వచ్చే అవకాశం ఉండనుంది. కమ్మ, కాపులు ఏకమై తనను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మిగిలిన కులాలను ఓన్ చేసుకునే అవకాశం ఉండనుంది. ఈ క్రమంలోనే ఏపీలో గత కొద్దిరోజులుగా కులాల ప్రస్తావన తరుచూ తెరపైకి వస్తోంది.

కులాలకు అతీతమని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇటీవల ఇదే అంశంపై తరుచూ మాట్లాడుతున్నారు. కాపులను ఓన్ చేసుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వైసీపీ మంత్రులు సైతం పవన్ కల్యాణ్ పై కాపు ముద్ర వేయడంతో సక్సస్ అవుతున్నారు. టీడీపీ, జనసేన మరోసారి కలిస్తే పొటీ చేస్తే కమ్మ, కాపులకు ధీటుగా రెడ్డి, నాన్ రెడ్డీస్ అంశంపై తెరపైకి వచ్చే అవకాశం కన్పిస్తుంది. ఈ పరిణమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో విజయవంతమైన ఫార్మూలానే సీఎం జగన్ కొన్ని మార్పులుచేసి తిరిగి ప్రయోగిస్తుండటంతో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.

-Advertisement-జగన్ కు లైన్ క్లియర్ చేస్తున్న ఆ ఇద్దరు నేతలు?

Related Articles

Latest Articles