బిగ్ బాస్ 5 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ లో ఆ ఆరుగురు!?

అనుకున్నట్టుగానే బిగ్ బాస్ 5లో ఆవేశకావేశాలు, అపార్థాలకు తొలి రోజునే తెరలేచింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించిన నామినేషన్స్ లో ఇగోస్ కు దాదాపుగా మెజారిటీ కంటెస్టెంట్స్ పెద్ద పీట వేశారు. నామినేషన్ ప్రక్రియ సింగర్ రామచంద్రతో మొదలై, ఆర్. జె. కాజల్ తో ముగిసింది. మానస్, జస్వంత్ ను రామచంద్ర నామినేట్ చేయగా; కాజల్, రవిని సరయు నామినేట్ చేసింది. ఇక స్వాతివర్మ… హమిదా, నటరాజ్ మాస్టర్లను నామినేట్ చేసింది. విశ్వ… జస్వంత్, మానస్ లను; యాని మాస్టర్ సిరి, జస్వంత్ లను నామినేట్ చేశారు. జస్వంత్… విశ్వను, హమిదను నామినేట్ చేయగా; రవి… నటరాజ్, మానస్ లను నామినేట్ చేశాడు. ఉమాదేవి… ఆర్.జె. కాజల్ ను, జస్వంత్ ను; హమిద… లహరి, జస్వంత్ లను నామినేట్ చేశారు. షణ్ముఖ్… సన్ని, లోబోను నామినేట్ చేయగా; ప్రియాంక… షణ్ముఖ్, హమిద ను నామినేట్ చేసింది. నటరాజ్… రవి, జెస్సీని; ప్రియ… సిరి, కాజల్ ను; లోబో… ప్రియ, రవిను; మానస్… విశ్వ, సరయు ను నామినేట్ చేశారు. చివరగా సిరి… హమిద, ప్రియను; లహరి.. హమిద, కాజల్ ను; కాజల్… సరయు, ఉమను నామినేట్ చేశారు.

చిత్రం ఏమంటే… చాలామంది తమతో సరైన బాండింగ్ ఏర్పడని వారిని నామినేట్ చేయగా, షణ్ముఖ్… సన్ని యాటిట్యూడ్ ను తట్టుకోలేక నామినేట్ చేసినట్టు చెప్పాడు. అలానే లోబో కూడా తాను ప్రియ, రవిని నామినేట్ చేయడానికి వారి యాటిట్యూడ్ కారణమని తెలిపాడు. ఈ మొత్తం నామినేషన్ ప్రక్రియలో బేలగా ప్రవర్తించింది హమిద, జస్వంత్ కావడం విశేషం. వీళ్ళిద్దరి నెత్తిమీద నీటి కుండ ఉందన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఆర్. జె. కాజల్ తన ఓవర్ ఎగ్జైట్ మెంట్ కు సరైన రీజన్ చెప్పి అందరిని ఆకట్టుకుంది. అలానే సరయు, ఉమను తను నామినేట్ చేయడానికి వారు తనని నామినేట్ చేయడం తప్పితే వేరే కారణం లేదని సేఫ్ గేమ్ ప్లే చేసింది. ఇటు బుల్లితెరపైన అటు వెండితెరపైన నటుడిగా కాస్తంత అనుభవం ఉన్న మానస్ ఇంకా ఓపెన్ కాకపోవడం కాస్తంత విడ్డూరమే! అలానే షణ్ముఖ్ కూడా చాలా లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. దానికి కారణం తెలియాల్సి ఉంది. సింగర్ రామచంద్ర సైతం ఇంకా పూర్తిగా తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం మొదలెట్టలేదు!

ఓవర్ ఆల్ గా ఫస్ట్ వీక్ కు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు రాత్రి ఆసక్తికరంగా సాగింది. సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఈ ఆరుగురు తొలివారం నామినేషన్ లో ఉన్నారు. వీరిలో కాస్తంత బలహీనంగా హమిద కనిపిస్తోంది. ఆమెను ఎంత వరకూ బిగ్ బాస్ వ్యూవర్స్ సేవ్ చేస్తారో చూడాలి. అలానే మానస్ సైతం వీక్ గానే ఉన్నాడు. అతను బయటకు వస్తే మాత్రం తిరిగి తన సీరియల్స్ షూటింగ్స్ పడిపోతాడేమో మరి!!

Related Articles

Latest Articles

-Advertisement-