వారికి ఆ షరతులు వర్తించవా?

ప్రధాని మోడీ ఈరోజు అమెరికా బయలుదేరి వెళ్లారు.  ఈనెల 23 న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు.  ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వాక్సిన్ తీసుకొని ఉండాలి.  అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి.  ఇండియాలో సొంతంగా అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు గుర్తించలేదు.  ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ను ప్రధానితో  పాటుగా అనేక మంది నేతలు తీసుకున్నారు.  కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధానికి అమెరికా ఎలా అనుమతులు ఇచ్చిందనే సందేహాలను వెలుబుచ్చుతున్నారు చాలా మంది.  ట్విట్టర్ లో దీనిపై అనేక మంది ప్రశ్నిస్తున్నారు.  కోవాగ్జిన్ వాక్సిన్ తాము ఎక్కడికి వెళ్లలేకపోతున్నామని, అలాంటిది ప్రధాని ఎలా వెళ్లగలిగారని, వాక్సిన్ షరతులు మామూలు ప్రజలకే వర్తిస్తాయా?  నేతలకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.  

Read: దారుణం: మాస్క్ పెట్టుకున్నారని… రెస్టారెంట్ నుంచి గెంటేశారట…!!

-Advertisement-వారికి ఆ షరతులు వర్తించవా?

Related Articles

Latest Articles