నా కూతురు వల్లే సమంతను కలిశాను: గుణశేఖర్

దర్శకుడు గుణశేఖర్.. చారిత్రక, పౌరాణిక చిత్రాలను భారీ సెట్టింగులతో అద్భుతంగా తెరకెక్కించడంతో చాలా అనుభవమున్న దర్శకుడు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం ముచ్చట్లను పంచుకున్నారు. ‘శాకుంతలం పాత్రలో సమంతను తాను అసలు అనుకోలేదని, వేరే యాక్టర్స్ గురించి ఆలోచిస్తున్న సమయంలో సమంత అయితే బాగుంటుందని తన కూతురు నీలిమ సూచించిందని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. తర్వాత తాను వెళ్లి సమంతను కలిసిన వెంటనే తనకు కాన్ఫిడెన్స్ వచ్చిందనీ, ఇప్పుడు షూటింగ్ చేస్తుంటే తమ నిర్ణయం 100% కరెక్టేనని అనిపిస్తోందని ఆయన చెప్పారు. సమంత అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివి. ఆమె వల్లనే సగం వరకు చిత్రీకరణను పూర్తిచేయగలిగాము’ అని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-